హైదరాబాద్: 28°C
తెలంగాణ

మతిస్థిమితం లేని వృద్ధుడు అదృశ్యం

MNCL: సోన్‌ మండలం జాఫ్రాపూర్‌కు చెందిన లోలం చిన్నయ్య అదృశ్యమయ్యాడు. ఎస్ఐ గోపి వివరాల ప్రకారం.. చిన్నయ్య మూడేళ్లుగా అనారోగ్యంతో పాటు మతిస్థిమితం లేకుండా బాధపడుతున్నాడు. ఈ నెల 22న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. కుమారుడు సాయన్న ఫిర్యాదుతో కేసు నమోదైంది.