హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి: మాజీ MLA

BHPL: మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నుంచి వెంటనే నీటిని లిఫ్ట్ చేసి రైతులకు అందించాలని భూపాలపల్లి మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నీళ్లు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.