BDK: వేటగాళ్ల ఉచ్చుకు గర్భిణీ దుప్పి బలైన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో అమర్చిన ఉచ్చులో చిక్కుకుని తీవ్రంగా గాయపడిన ఆడ దుప్పి ప్రాణాలకై పోరాడుతూ మృతి చెందింది. అత్యంత విషాదకరంగా, ఆ దుప్పి కడుపులో ఉన్న చిన్న పిండాన్ని బయటకు తీసి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. వేటగాళ్ల దుశ్చర్యకు ఒకేసారి రెండు జీవాలు బలవడం హృదయాలను కలచివేసింది.
తెలంగాణ
వేటగాళ్ల ఉచ్చుకు రెండు జీవాలు బలి..!


