హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోసగాడు అరెస్ట్.. రూ.10 వేలు, ఫోన్ స్వాధీనం

ADB: ఆర్టీసీ బస్టాండ్‌లో ఆటో డ్రైవర్‌ను మాటల్లో పెట్టి, ఫోన్ తీసుకుని ఫోన్‌పే ద్వారా రూ.17వేలు తన ఖాతాకు బదిలీ చేసుకున్న నిందితుడు రాథోడ్ యువరాజ్‌ను అరెస్టు చేసినట్లు DSP జీవన్ రెడ్డి మంగళవారం తెలిపారు. నిందితుడిపై గతంలో 8 కేసులున్నాయని వెల్లడించారు. నిందితుడి నుంచి రూ.10 వేల నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.