హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరదయ్యపాలెంలో అధ్వానంగా రోడ్లు

TPT: వరదయ్యపాలెంలోని పలు వీధుల్లో రోడ్లు అధ్వానంగా మారాయి. వర్షం పడినప్పుడల్లా రోడ్లపై నీరు నిలిచి, గుంతలు–బురదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.