హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు

JGL: కోరుట్ల మున్సిపల్ సాధారణ సమావేశం చైర్‌పర్సన్ తిరుమల వసంత అధ్యక్షతన మంగళవారం జరిగింది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, దోమల వృద్ధిని అరికట్టాలని సూచించారు. సమావేశంలో 8 అంశాల ఎజెండాకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.