GDWL: ప్రజానాట్యమండలి కళా సంస్థ నిర్వహించే ప్రతిభా పోటీలు విద్యార్థుల చైతన్యానికి ఎంతో దోహదపడతాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి హృదయ రాజు పేర్కొన్నారు. గట్టు మండలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు ‘సాంకేతిక రంగంలో ఏఐ - లాభనష్టాలు’ అనే అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 42 మంది విద్యార్థులు పాల్గొని, తమ అభిప్రాయాలను వివరించారు.
తెలంగాణ
'ప్రతిభ పోటీలు విద్యార్థుల చైతన్యానికి వేదిక'


