హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ అభివృద్ధికి దాతల భారీ విరాళం

W.G: కాళ్ల మండలం కాళ్లకూరు శ్రీ స్వామివారి దేవస్థానంలో అన్నదాన భవన అభివృద్ధి పనులకు తాడినాడకు చెందిన కీ.శే. కంతేటి సూరపరాజు (తాడినాడ శ్రీను) కుటుంబ సభ్యులు రూ.1,01,116 విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని ఆలయ పాలకమండలి అధ్యక్షులు అడ్డాల శివరామరాజు మంగళవారం తెలిపారు. దాతలకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేయడంతో పాటు వేద ఆశీర్వచనం చేసినట్లు పేర్కొన్నారు.