హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక

హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ ఛైర్మన్ శ్యామ్ మోహన్ నివేదిక సమర్పించారు. మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అంశాలపై విచారణ జరిపిన కమిటీ, ఇరువర్గాల వాదనలు పరిశీలించి నివేదిక రూపొందించింది. పార్టీ అధిష్ఠానానికి నివేదికను పంపించనున్నట్లు సమాచారం.