హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుడు బీపీ'

HNK: సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు బీపీ మండల్ అని మాజీ కుడా ఛైర్మన్, ఓబీసీ ఛైర్మన్ సుందర్రాజ్ యాదవ్ అన్నారు. రాంనగర్‌లోని బీసీ భవన్‌లో మంగళవారం బీపీ మండల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్య, ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాల కోసం మండల్ కమిషన్ కీలక సిఫారసులు చేసిందని తెలిపారు.