హైదరాబాద్: 28°C
తెలంగాణ

తహసీల్దార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

NZB: ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా మంగళవారం కమ్మర్‌పల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న ‘భూభారతి’ రీ-సర్వే ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. భూములకు సంబంధించిన రికార్డులు, సర్వే పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని సూచించారు.