హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో ఇకపై రాత్రి వేళల్లో సిటీ బస్సులు

HYD: హైదరాబాద్‌లో ఆగస్టు 29 నుంచి ఆరు ప్రధాన మార్గాల్లో రాత్రి వేళల్లో సిటీ బస్సులు నడపనున్నట్లు TGSRTC ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి. ఐటీ ఉద్యోగులు, నైట్‌ షిఫ్ట్‌ సిబ్బంది, ఆలస్యంగా ఇళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి. డిమాండ్‌ను బట్టి 30 నిమిషాల నుంచి గంట వ్యవధిలో బస్సులు నడపనున్నారు.