హైదరాబాద్: 28°C
క్రైమ్

రైల్వే‌స్టేషన్‌లో గంజాయి స్వాధీనం

TG: కామారెడ్డి రైల్వేస్టేషన్ వద్ద రైలులో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడి వద్ద 9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు తనిఖీ చేయడంతో బ్యాగులో 9 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఈ కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన కిషన్ పటేల్‌ను అరెస్ట్ చేశారు.