పార్వతీపురం పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా రెవెన్యూ డివిజనల్ అధికారి కె. మాధురి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ పారిశుధ్యం, మౌలిక వసతులు, తాగునీటి సరఫరా, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని మాధురి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో


