హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైబర్ క్రైమ్‌పై ఎస్సై కీలక సూచనలు

W.G: తణుకు మండలం మండపాక జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు మంగళవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తణుకు రూరల్ ఎస్సై ఎన్. శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, చిన్నపిల్లలు, మహిళలపై జరిగే నేరాల నివారణకు సహకరించాలని కోరారు.