హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటి ముందు బైక్‌లు దగ్ధం

W.G: నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో దుండగులు రెచ్చిపోయారు. నరసాపురం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న కె. డమరుకేశ్వర వర్మ ఇంటి ముందు పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలను గుర్తుతెలియని వ్యక్తులు తెల్లవారుజామున తగలబెట్టారు. మంగళవారం ఉదయం డ్యూటీకి వెళ్లేందుకు బయటకు వచ్చిన వర్మకు బైక్‌లు పూర్తిగా కాలిపోయి కనిపించాయి. ఘటనపై నరసాపురం పోలీసులకు సమాచారం అందించారు.