హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజమండ్రిలో సెప్టెంబర్ 7న డాక్ అదాలత్'

తూ.గో: రాజమండ్రి పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సెప్టెంబర్ 7న ఉదయం 11 గంటల నుంచి “డివిజనల్ లెవెల్ డాక్ అదాలత్" నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కె. శేషారావు ఒక ప్రకటనలో తెలిపారు. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్, పార్సెల్, మనీ ఆర్డర్, తపాలా పొదుపు పథకాలు, తపాలా జీవిత బీమా తదితర సేవలకు సంబంధించిన ఫిర్యాదులను ఈనెల 4లోపు అందించాలన్నారు.