NZB: పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఉద్యోగుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి DDO–IFMIS ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టింది. దీంతో వేతనాల చెల్లింపులో జాప్యం తగ్గడంతో పాటు పారదర్శకత పెరగనుంది. ఉద్యోగులకు సమయానికి జీతాలు అందే అవకాశం ఏర్పడింది.
తెలంగాణ
కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాల చెల్లింపులో ఊరట


