హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రేవ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి'

VKB:​ గ్రేవ్ కేసుల దర్యాప్తులో నాణ్యత, వేగం ఉండాలని వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా అధికారులను ఆదేశించారు. పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. శాస్త్రీయ, సాంకేతిక (CCTV, ఫోరెన్సిక్) ఆధారాలతో పకడ్బందీగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.