హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉపాధ్యాయులకు రాయితీలు కల్పించాలి'

AKP: ప్రత్యేక TETలో ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు రాయితీలు కల్పించాలని డిమాండ్ చేస్తూ యూటీఎ ఆధ్వర్యంలో అనకాపల్లి డీఈవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షురాలు శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల అనుభవం, వయస్సు, ఉద్యోగ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తగిన రాయితీలు కల్పించాలని కోరారు.