హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ సిబ్బందికి నియామక పత్రాలు పంపిణీ

నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలుగా 36 మంది నియామకమయ్యారు. ఈ నియామక ఉత్తర్వులను మంగళవారం నెల్లూరు వేదాయపాళెంలోని ఆయన కార్యాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సిబ్బందికి అందజేశారు. నూతనంగా నియమితులైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అంగన్ వాడీ కేంద్రాల్లో అంకితభావంతో పనిచేయాలని సూచించారు.