కృష్ణా: విజయవాడ వేదికగా జరుగుతున్న విమెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ వేలంలో బ్యాటర్ నీరగట్టు అనూషను రూ.2.10 లక్షలకు అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు దక్కించుకుంది. ఆమె కనీస ధర రూ.50 వేలు కాగా ఇతర ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఆల్రౌండర్ హెర్నిటా ప్లవియాను గోదావరి గోల్డెన్ ఈగిల్స్ రూ.4.30 లక్షలకు తీసుకుంది. ఇప్పటివరకు ఇదే రికార్డు ధర.
ఆంధ్రప్రదేశ్
విమెన్ ఏపీఎల్‌లో హెర్నిటాకు రికార్డు ధర


