MLG: తిరుమల తిరుపతి దేవస్థానంలో ములుగు జిల్లా BRS అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, ఏటూరునాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత దంపతులు శ్రీవేంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. శ్రీలత పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాసేవలో మరింత శక్తి, నిబద్ధత ప్రసాదించాలని ప్రార్థించారు.
తెలంగాణ
తిరుమల స్వామి సన్నిధిలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు


