VZM: హైదరాబాద్‌లో జూలై 23 నుంచి 31 వరకు జరిగిన 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ 2026-27 తైక్వాండో పోటీల్లో విజయనగరం ట్రాఫిక్ కానిస్టేబుల్ బి.ఎస్.ఎన్. మూర్తి బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా మూర్తిని, ఆయన కోచ్ జి.రాజేష్‌ను ఎస్పీ దామోదర్ మంగళవారం అభినందించారు. 2027 మార్చిలో ఆస్ట్రేలియాలో జరిగే వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌కు ఎంపికయ్యారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కానిస్టేబుల్‌కు బంగారు పతకం


