హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈరన్నకు రూ.92.46 లక్షల ఆదాయం

KRNL: ఉరుకుంద శ్రీలక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానంలో శ్రావణమాస ఉత్సవాల హుండీ లెక్కింపు నిర్వహించారు. మూడు రోజుల ఆదాయంగా రూ.92,46,685 నగదు, 21.5 గ్రాముల బంగారం, 15.2 కిలోల వెండి లభించినట్లు ఈవో కె.వాణి తెలిపారు. పాలకమండలి సభ్యులు, దేవస్థాన సిబ్బంది, బ్యాంకు సిబ్బంది, సేవా సమితి సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు.