హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హోంగార్డులకు హెల్త్ కార్డులు అందజేత

VZM: జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తున్న హోంగార్డులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఓ ఆసుపత్రి సహకారంతో హెల్త్ కార్డులను అందజేశారు. కేవలం రూ.100 రిజిస్ట్రేషన్‌తో స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్, ఎక్స్‌రే, ల్యాబ్ పరీక్షలు ఉచితంగా, ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్ తదితర పరీక్షలను 50 శాతం రాయితీతో అందించనున్నట్లు ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు.