హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల యూనిఫామ్‌ల కుట్టు పనుల పరిశీలన

NZB: పెద్ద వాల్గోట్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న ఉచిత యూనిఫామ్‌ల కుట్టు పనులను మండల విద్యాధికారి రాములు పరిశీలించారు. యూనిఫామ్‌లు సరైన కొలతలతో నాణ్యతగా ఉండేలా కుట్టాలని మహిళా సంఘాల సభ్యులకు సూచించారు. అనంతరం పాఠశాలలో FLN, MDM, ప్రీ-ప్రైమరీ, AI AXL ల్యాబ్, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించి పలు సూచనలు చేశారు.