హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడేపల్లిలో కోనోకార్పస్ చెట్ల తొలగింపు

GNTR: తాడేపల్లి 13వ వార్డులో కోనోకార్పస్ మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి మాట్లాడుతూ.. కోనోకార్పస్ చెట్ల వల్ల మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. అందుకే వాటిని తొలగించినట్లు పేర్కొన్నారు.