హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిలాద్‌ ఉన్‌ నబీపై శాంతి కమిటీ సమావేశం

RR: ఎల్‌బీనగర్‌ డీసీపీ అనురాధ ఆధ్వర్యంలో మిలాద్‌ ఉన్‌ నబీ బందోబస్తు ఏర్పాట్లపై మంగళవారం డీసీపీ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. 30 మంది కమిటీ సభ్యులు, ముస్లిం పెద్దలు, వనస్థలిపురం ఏసీపీ, అన్ని ఎస్‌హెచ్‌వోలు హాజరయ్యారు. పండుగను శాంతియుతంగా, సామరస్యంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.