హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దేవదాయ నిబంధనలు పాటించాలి'

VSP: దేవదాయ ధర్మదాయ చట్టం నిబంధనల మేరకు ట్రస్ట్‌ బోర్డులు పనిచేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌ సూచించారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పూజలు, సేవలు, టికెట్ల విక్రయం విషయంలో దేవదాయ శాఖ అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ఇందులో ఈవో ఎన్‌. సుజాత, ఛైర్మన్ నాగరాజు పాల్గొన్నారు.