హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికుల అవస్థలు

ASR: అరకులోయ నుంచి పాడేరు వెళ్లే ఆర్టీసీ బస్సు మంగళవారం సాయంత్రం డుంబ్రిగూడలో నిలిచిపోయింది. దీంతో సాయంత్రం వేళ విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సు అందుబాటులో లేక కొంతసేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.