NZB: వర్ని మండలం తగిలేపల్లి మాజీ సర్పంచ్ వెంకటి హత్య ఆస్తి తగాదాల కారణంగానే జరిగినట్లు రుద్రూరు సీఐ కృష్ణ తెలిపారు. తగిలేపల్లి శివారులో సోమవారం రాత్రి వెంకటి హత్యకు గురయ్యారు. వెంకటికి అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు నారాయణతో ఆస్తి వివాదాలు ఉన్నాయని సీఐ వెల్లడించారు. ఈ కారణంగానే నారాయణ హత్యకు పాల్పడినట్లు తెలిపారు.
తెలంగాణ
'మాజీ సర్పంచ్‌ను హత్యచేసిన మాజీ ఎంపీటీసీ'


