హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేసిన తహశీల్దార్

WNP: పానగల్ మండల పరిధిలోని బుసిరెడ్డిపల్లి రేషన్ షాపును మంగళవారం తహశీల్దార్ కార్తీక్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్ధిదారులకు సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం పంపిణీ రిజిస్టర్లను, స్టాక్ నిల్వలను పరిశీలించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా మూడు నెలలకు సంబంధించిన సన్నబియ్యం పారదర్శకంగా పంపిణీ చేయాలని డీలర్‌ను ఆదేశించారు.