ASR: హుకుంపేట మండలం పేడిరాయి గ్రామంలో పాఠశాలకు సొంత భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టార్పాలిన్లు, వెదురు కర్రలతో ఏర్పాటు చేసిన తాత్కాలిక పాకలోనే చిన్నారులు చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాలు, గాలుల సమయంలో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల భవనం నిర్మించాలని అధికారులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలకు భవనం లేక ఇబ్బందులు


