హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

అన్నమయ్య: రాయచోటి మార్కెట్‌ యార్డులోని ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. బీయూ, సీయూ, వీవీప్యాట్‌ల భద్రతను పరిశీలించారు. గోడౌన్‌ వద్ద పటిష్ట భద్రతను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఏ. శ్రీనివాస్‌, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.