హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసు ఉద్యోగాలకు ఉచిత కోచింగ్

భద్రాద్రి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాలకు ఉచిత సెమీ రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వనున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఆగస్టు 26 నుంచి 31 వరకు పోలీస్ స్టేషన్లలో దరఖాస్తులు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 6న కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, భద్రాచలం, మణుగూరులో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని మహిళా అభ్యర్థులు కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.