PPM: జియ్యమ్మవలస మండలం బాసంగిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితి దయనీయంగా మారింది. వరద నీటిలో పాఠశాల మునిగింది. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. పాఠశాలలోకి నీరు చేరడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వరద ముంపులో పాఠశాల


