హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీచర్ తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం

అన్నమయ్య: రాజంపేట మండలం గుండ్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో హిందీ టీచర్ ప్రశాంతి తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను దుర్భాషలాడుతున్నారని ఆరోపిస్తూ “టీచర్ మాకొద్దు” అంటూ నిరసన చేపట్టారు. పాఠశాల గేటుకు తాళం వేసి, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.