హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వేస్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత

KMR: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్, రైల్వే టాస్క్​ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సంబల్‌పూర్ నుంచి నాందేడ్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో గంజాయి రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో అధికారులు స్టేషన్‌లో నిఘా పెట్టారు. తనిఖీలో 2 కిలోల చొప్పున నాలుగు ప్యాకెట్లు, మరో కిలో ప్యాకెట్ కలిపి మొత్తం 9 కిలోల గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి.