SRD: సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని రైతు బజార్‌లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. కూరగాయల వ్యర్థాలను రైతు బజార్ ఆవరణలో పడేయడంతో దుర్వాసనతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వర్షాలు కురుస్తుండడంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
రైతు బజార్‌లో అధ్వానంగా పారిశుద్ధ్యం


