CTR: ATM కేంద్రాల వద్ద అమాయకులను మోసం చేస్తున్న నిందితున్ని అరెస్ట్ చేసినట్టు బంగారుపాలెం CI శ్రీనివాసులు తెలిపారు. పలమనేరు మండలం బేరుపల్లికి చెందిన దుర్గాప్రసాద్ ఏటీఎంల వద్ద అమాయకులను మోసం చేస్తూ.. నగదు కాజేస్తున్నట్టు ఫిర్యాదు అందిందన్నారు. దీంతో అతనిని పట్టుకొని విచారించి.. అతని వద్ద 67 ఏటీఎం కార్డులు, బైక్, రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మోసగాడు అరెస్ట్..!


