హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల సహకారంతో 4 గంటల్లో కేసు ఛేదన

JGL: తిమ్మాపూర్ శివారులో వృద్ధురాలి మృతి కేసును జగిత్యాల రూరల్ పోలీసులు కేవలం నాలుగు గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో కీలకమైన బైక్ ఫొటో ఆధారాలు అందించిన దోమల రవి, గంగాధర్‌లను ఎస్పీ అశోక్‌కుమార్ అభినందించి బహుమతులు అందించారు. కేసును వేగంగా ఛేదించిన సీఐ సుధాకర్, ఎస్‌ఐ ఉమాసాగర్, సిబ్బందిని అభినందించారు.