NRML: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎంపీఓ గోవర్ధన్ అన్నారు. మంగళవారం సాయంత్రం వారు దిలావర్పూర్ మండలంలోని ఎస్సీ సంక్షేమ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటశాలను పరిశీలించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేశారు. ప్రతిరోజు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందేలా చూడాలని అక్కడి వార్డెన్‌ను ఆదేశించారు.
తెలంగాణ
'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'


