హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక నవరాత్రుల ఏర్పాట్లపై సమావేశం

RR: రాబోయే వినాయక నవరాత్రులు, నిమజ్జనం ఏర్పాట్లపై మల్కాజిగిరి జోనల్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయ సమావేశం జరిగింది. ఇందులో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పండుగ వేళ రోడ్ల మరమ్మతులు, నిరంతర పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.