హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి'

W.G: ఆచంట సీహెచ్సీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఏళ్ల తరబడి వైద్యారోగ్య శాఖలో సేవలందిస్తున్న తమను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.