హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ నాయకురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత

E.G: కడియంకి చెందిన టీడీపీ పార్టీ సీనియర్ దళిత నాయకురాలు వేలంగి గౌరమ్మ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కుటుంబానికి అండగా నిలిచేందుకు నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ సభ్యులు తమ వంతు సహాయంగా రూ.35,000 సమకూర్చారు. ఈ మొత్తాన్ని మంగళవారం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా వేలంగి గౌరమ్మ కుటుంబ సభ్యులకు అందజేశారు.