హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కళ్యాణ మండపాల పనులు పూర్తి చేయాలి'

VSP: కొమ్మాది, సాయిరాం కాలనీ కళ్యాణ మండపాల్లో పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మండపాలను పరిశీలించిన ఆయన రూ.1.66 కోట్లతో చేపట్టిన పనుల్లో ఫాల్‌సీలింగ్, నీటి వసతి వంటి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం సాయిరాం కాలనీలో ఇంటింటి తెలుగుదేశం ప్రచారం నిర్వహించారు.