హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలి’

BPT: సంతమాగులూరు మండలంలోని కొప్పరం, సజ్జాపురం గ్రామాల్లో మంగళవారం ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి షేక్ సైదా మాట్లాడుతూ..ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా పెసర, కంది, మినుములు, సజ్జ, కొర్ర తదితర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని సూచించారు.