MDK: నిజాంపేట్ మండలంలో రానున్న రెండు నెలల్లో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నందున రైతులు వరికి బదులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ సూచించారు. మంగళవారం నిజాంపేటలో రైతు ఎల్లం పొలంలో జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు. భూగర్భజలాల ఆధారంగా మొక్కజొన్న, పప్పుధాన్యాలు, ఆముదం వంటి పంటలు సాగు చేయాలన్నారు.
తెలంగాణ
ఆరుతడి పంటల వైపు మళ్లాలని ఏవో సూచన


