హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

GDWL: గద్వాల మండలం అనంతపురం గ్రామ శివారులో గుంటూరుకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు అశోక్ (45) అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతి చెందాడు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గద్వాల రూరల్ పోలీసులు వివరాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.